• సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతు పనులు
• ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిపివేత
• వివరాలు వెల్లడించిన విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్
సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: చౌటుప్పల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నిర్వహించనున్న అత్యవసర మరమ్మతు పనుల కారణంగా శనివారం (ఆగస్టు 8న) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సతీష్ కుమార్ తెలిపారు. ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ విద్యుత్ కోత వల్ల తంగడపల్లి అగ్రికల్చర్, లింగోజిగూడెం అగ్రికల్చర్, జిబ్లక్ పల్లి అగ్రికల్చర్, చిన్నకొండూరు అగ్రికల్చర్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని వివరించారు. వినియోగదారులు, రైతాంగం ఈ విషయాన్ని గమనించి మరమ్మతు పనులకు, విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.