ప్రజాసమస్యపై స్పందన.. రోడ్డు గుంత పూడ్చివేత

• జన్నారంలో వాహనదారుల కష్టాలు తీర్చిన పీసీఆర్ ఫౌండేషన్ • ప్రజా సంక్షేమమే ధ్యేయమన్న వ్యవస్థాపకుడు ముడుగు ప్రవీణ్ సూర్య డిజిటల్ న్యూస్, జన్నారం: జన్నారం మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతను పీసీఆర్ (పూర్ణచందర్రావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పూడ్చివేశారు. రహదారిపై పెద్ద గుంత ఏర్పడటంతో వాహనదారులు, కాలినడకన వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముడుగు ప్రవీణ్...