SURYA DIGITAL NEWS
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 2:27 pm Posted by : SURYA DIGITAL NEWS

కంటి వైద్య శిబిరం లబ్ధిదారులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్:

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలై 5న చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో కళ్లజోళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు ఆదివారం (ఆగస్టు 9) ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ యాదాద్రి భువనగిరి కార్యదర్శి చింతల సాయిలు తెలిపారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు లక్కారం వద్ద ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సంబంధించిన కళ్లజోళ్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సంబంధిత మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ శాఖల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు లబ్ధిదారులకు సమాచారం అందించి, వారిని కార్యక్రమానికి తీసుకువచ్చి కళ్లజోళ్లు అందజేయాలని కోరారు.

కళ్లజోళ్ల పంపిణీ ప్రక్రియ ఆగస్టు 9 నుంచి వారం రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం పెద్దగొని మౌనిక (9951690808), ఊదరి మహేష్ (9550941419)ను సంప్రదించాలని సూచించారు.