సూర్య డిజిటల్ న్యూస్, వలిగొండ :
వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామానికి చెందిన నిరుపేద బత్తిని అంజమ్మ అనారోగ్య కారణాలతో శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వాకిటి అనంతరెడ్డి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి, దహన సంస్కారాల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆవుల స్వామి, కొడితల కరుణాకర్, శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డైరెక్టర్ దామెర అంజయ్య, రేఖ మచ్చి, వేముల అనిల్, ఎర్ర సాయి, ఆకుల మత్స్యగిరి, జినుకల మల్లేష్, మర్రి ముత్యాలు, మారగొని శ్రీను, మాటూరి సాయి, బత్తిని నరసింహ తదితరులు పాల్గొన్నారు.