SURYA DIGITAL NEWS
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 11:04 am Posted by : SURYA DIGITAL NEWS

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న డీసీఎం

డ్రైవర్ స్వరూప్ అక్కడికక్కడే మృతి

సూర్య డిజిటల్ న్యూస్, నార్కట్‌పల్లి :

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం, నార్కట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిసింది. ప్రమాదం తీవ్రతకు డీసీఎం వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.

ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ స్వరూప్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన ఇతర అంశాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.