SURYA DIGITAL NEWS
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 8:33 am Posted by : SURYA DIGITAL NEWS

ఉచిత మెగా వైద్య శిబిరం

పద్మజ్యోతి యువజన సంఘం, ప్రగ్మా ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ

ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్‌ :

చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామంలో నేడు (ఆదివారం) ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. పద్మజ్యోతి యువజన సంఘం, వనస్థలిపురం ప్రగ్మా ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

స్థానిక పద్మజ్యోతి యువజన సంఘం ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం కొనసాగనుంది. ఈ సందర్భంగా రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) పరీక్షలతో పాటు సీబీపీ, ఆర్‌బీఎస్, లిపిడ్ ప్రొఫైల్ వంటి వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈసీజీ, 2డీ ఎకో తదితర వైద్య పరీక్షలను కూడా ఉచితంగా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

పరీక్షల అనంతరం అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పద్మజ్యోతి యువజన సంఘం ప్రతినిధులు కోరారు.