నేడు నర్సంపేటకు కేసీఆర్
• పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న బీఆర్‌ఎస్ అధినేత • కుటుంబ సభ్యులకు పరామర్శ.. పార్టీ శ్రేణులకు భరోసా • పెద్ది కుటుంబానికి ఇప్పటికే రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్ సూర్య డిజిటల్ న్యూస్, నర్సంపేట: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చనున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి కేసీఆర్ వెళ్లనున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి బీఆర్‌ఎస్...