వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ఎన్నిక
• నూతన అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సర్వసభ్య సమావేశానికి గ్రామ సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్, ఉప సర్పంచ్ జెల్ల పవన్, రామాలయం చైర్మన్...