SURYA DIGITAL NEWS
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 5:42 pm Posted by : SURYA DIGITAL NEWS

30 శాతం గ్రాంట్ విడుదల చేయాలి

సూర్య డిజిటల్ న్యూస్, యాదగిరిగుట్ట :

యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించిన 30 శాతం గ్రాంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులు గురువారం యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవాని శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు గ్రాంట్ నిధులు కీలకమని వారు ఈవోకు వివరించారు. పెండింగ్‌లో ఉన్న 30 శాతం గ్రాంట్‌ను విడుదల చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఈవో భవాని శంకర్‌కు మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిల్ సభ్యులు సమస్యను వివరించి, గ్రాంట్ విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ బరిగే రమ్య రామ్‌చందర్, మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యులు బూడిద మధు, కటబత్తిని స్వప్న ఆంజనేయులు, బిట్టు సరోజ హరీష్, కర్రే మాధురి ప్రవీణ్, పెల్లిమెల్లి లావణ్య శ్రీధర్, పేరబోయిన సత్యనారాయణ, సాదునేని ధనలక్ష్మి మధుకర్, ముక్కెర్ల మల్లేష్, బబ్బురి శ్రీధర్, కో-ఆప్షన్ సభ్యులు గౌలికర్ అరుణ రాజేష్, ఎండి రహిమ సలాం, బండి జంగమ్మ శ్రీశైలం, షేక్ ఉస్మాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.