ఆలయ పాలకవర్గ సభ్యులు నిజాయితీగా పనిచేయాలి

• భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి • మీరు నిజాయితీగా పనిచేయండి.. మీ సమస్యలు నేను పరిష్కరిస్తా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్‌ : ఆలయ పాలకవర్గ సభ్యులు బాధ్యతాయుతంగా, నిజాయితీగా పనిచేస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం చిన్న కొండూరు రోడ్డులోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ...