కెమికల్ దందా గుట్టు రట్టు

- ఐదుగురు అరెస్ట్‌.. ఐదు వాహనాలు స్వాధీనం - ట్యాంకర్‌ డ్రైవర్లతో కుమ్మక్కై అక్రమంగా విక్రయం - వెలిమినేడు శివారులో చిట్యాల పోలీసుల దాడి సూర్య డిజిటల్ న్యూస్, చిట్యాల: పారిశ్రామిక రసాయనాలను తరలిస్తున్న ట్యాంకర్ల నుంచి అక్రమంగా రసాయనాలను దారి మళ్లించి, డ్రమ్ముల్లో నిల్వ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును చిట్యాల పోలీసులు రట్టు చేశారు. వెలిమినేడు శివారులోని రాజస్థాన్‌ ధాబా సమీపంలో ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కెమికల్‌ ట్యాంకర్లు, మూడు ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు....