పల్లెల్లో ప్రశాంతత.. బెల్ట్ షాపులకు చెక్
• రాజగోపాల్‌రెడ్డి పిలుపునకు విశేష స్పందన • పలు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు.. ఉల్లంఘిస్తే జరిమానాలు • మునుగోడు స్ఫూర్తితో పొరుగు నియోజకవర్గాల్లోనూ అమలు సూర్య డిజిటల్ న్యూస్, మునుగోడు: గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్మూలించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిర్ణయాలు ఇతర ప్రాంతాల పల్లెలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఆదర్శంగా తీసుకుని పక్క నియోజకవర్గాల్లోని పలు గ్రామ పంచాయతీలు సైతం బెల్ట్ షాపుల నిర్మూలనకు...