ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం
• సిమెంట్ బస్తాలు ఇస్తానంటూ ఇంటికి పిలిచి అఘాయిత్యం చేసినట్లు ఫిర్యాదు • రెండు నెలలుగా వేధింపులు.. • కేసు పెట్టకుండా భూమి ఇస్తామని రాయబారం • ఆత్మకూరు(ఎం) పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు సూర్య డిజిటల్ న్యూస్, ఆత్మకూరు(ఎం): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయగూడెంలో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి, సిమెంట్ బస్తాలు ఇస్తానంటూ ఇంటికి పిలిచి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు...