తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
- రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు రెవెన్యూ అధికారులు - రూ.20 వేలు డిమాండ్.. రూ.14 వేలకు ఒప్పందం - గ్రామ పాలన అధికారి అహ్మద్, ఆర్‌ఐ పూర్ణచంద్రరావు అదుపులో సూర్య డిజిటల్ న్యూస్, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా కొలనుపాక గ్రామ పాలన అధికారి (జీపీఓ) అహ్మద్, ఆర్‌ఐ పూర్ణచంద్రరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనతో తహసీల్దార్ కార్యాలయంలో కలకలం...