అమెరికాలో తెలంగాణ యువకుడి ఆత్మహత్య

- ప్రేమించిన యువతి దూరమైందనే మనస్తాపంతో సాయిప్రదీప్ బలవన్మరణం సూర్య డిజిటల్ న్యూస్, మేడ్చల్: ప్రేమ విఫలమైందనే మనస్తాపంతో అమెరికాలో ఉన్న తెలంగాణకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ పరిధిలోని శ్రీనివాసనగర్‌కు చెందిన నాగభైరవ కృష్ణ, విజయలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు సాయిప్రదీప్ అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కృష్ణ, విజయలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు 2023లో అమెరికాకు వెళ్లగా, చిన్న కుమారుడు సాయిప్రదీప్ 2024లో అమెరికాకు వెళ్లి అన్నతో కలిసి ఉంటున్నాడు. అక్కడ పార్ట్‌టైమ్ ఉద్యోగం...