చౌటుప్పల్‌లో భగ్గుమన్న అఖిలపక్ష నిరసన
కమిషనర్ తీరును నిరసిస్తూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బహిష్కరణ రూ.40 లక్షల నిధుల ఖర్చుపై రాని స్పష్టత.. రికార్డులు మాయం! సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్ : ప్రజా సమస్యలను గాలికొదిలి, అధికారుల ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్న తీరుపై చౌటుప్పల్ పట్టణంలో నిరసనల గళం వినిపించింది. మున్సిపల్ కార్యాలయంలో గురువారం జరగాల్సిన కౌన్సిల్ సమావేశం అఖిలపక్ష కౌన్సిలర్ల నిరసనతో వేడెక్చింది. కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి నేరుగా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పాలనలో పారదర్శకత కరువైందని, మినిట్ బుక్,...