టోల్‌గేట్‌ వద్ద ఘోర ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న డ్రైవర్ మృతి

​అకస్మాత్తుగా బ్రేక్ వేసిన గుర్తుతెలియని వాహనం ​చౌటుప్పల్ పరిధిలోని పంతంగి వద్ద దుర్ఘటన సూర్య డిజిటల్ న్యూస్​, చౌటుప్పల్‌: పంతంగి టోల్‌గేట్ సమీపంలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నోముల దీపక్ (22) హైదరాబాద్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం రాత్రి దీపక్ తన స్నేహితుడు దున్నపోతుల శ్రీకాంత్‌తో కలిసి బైక్‌పై స్వగ్రామానికి పయనమయ్యాడు. జగన్నాథపురం మునగాల మండలానికి...