రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి

• బొజ్జ గణపయ్య పూజలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం • భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. ప్రజల సంక్షేమం కోసం విఘ్నేశ్వరుడిని ప్రార్థించిన ముఖ్యమంత్రి సూర్య డిజిటల్ న్యూస్, హైదరాబాద్‌: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొజ్జ గణపయ్యను భక్తిశ్రద్ధలతో పూజించి రాష్ట్ర ప్రజలందరి సంక్షేమాన్ని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి...