గణనాథుని సేవలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం
• పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతికి విశేష పూజలు • నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష సూర్య డిజిటల్ న్యూస్, నకిరేకల్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తన సతీమణి పుష్పతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పన్నాలగూడెంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన మట్టి గణపతికి కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించారు. అనంతరం...