• మల్కాపురం వైన్స్ సమీపంలోని చెట్ల పొదల్లో లభ్యం
• మృతుడు నాగరాజు (35)గా ప్రాథమిక గుర్తింపు
• మృతికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు
సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్ :
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం, దండు మల్కాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో మల్కాపురం వైన్స్ సమీపంలోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పెట్రోల్ మొబైల్–2 సిబ్బంది సైదయ్య, హెచ్‌సీ–1226, హెచ్‌జీ–720 సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ పురుషుడి మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక విచారణలో మృతుడు నాగరాజు, వయస్సు సుమారు 35 సంవత్సరాలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మృతికి గల కారణాలు, ఇతర వివరాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జీ. మన్మధ కుమార్ తెలిపారు.