గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

• మల్కాపురం వైన్స్‌ సమీపంలోని చెట్ల పొదల్లో లభ్యం • మృతుడు నాగరాజు (35)గా ప్రాథమిక గుర్తింపు • మృతికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం, దండు మల్కాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో మల్కాపురం వైన్స్‌ సమీపంలోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు....