పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
- జలాల్‌పురంలో ఘనంగా పోషణ్ మాసం వేడుకలు - సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు సూర్య డిజిటల్ న్యూస్, భూదాన్‌పోచంపల్లి : మండలంలోని జలాల్‌పురం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో ‘పోషణ్ మాసం-సెప్టెంబర్ 2026’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మ, గ్రామ సర్పంచ్ శాపాక లింగస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు తక్కువ ఖర్చుతో లభించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. రక్తహీనత...