SURYA DIGITAL NEWS
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 10:30 pm Posted by : SURYA DIGITAL NEWS

విజయదశమి ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు నింపాలి

విజయదశమి ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు నింపాలి

చౌటుప్పల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌ గౌడ్‌

  • కచ్చీరు వద్ద శమీ పూజల్లో పాల్గొన్న చైర్‌పర్సన్‌
  • సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
  • రావణ దహనాన్ని వీక్షించిన పురప్రజలు

సూర్య డిజిటల్‌ న్యూస్‌, చౌటుప్పల్‌: విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సకల శుభాలు, విజయాలు నింపాలని చౌటుప్పల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌ గౌడ్‌ ఆకాంక్షించారు. విజయదశమి వేడుకల్లో భాగంగా పట్టణంలోని కచ్చీరు ప్రాంగణంలో నిర్వహించిన శమీ (జమ్మి) పూజల్లో ఆమె పాల్గొని సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించాలని దుర్గామాతను ప్రార్థించినట్లు తెలిపారు. పట్టణంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తిశ్రద్ధలతో భవానీ దీక్షలు స్వీకరించడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని సందర్శించి అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావణాసుర వధ (రావణ దహనం) కార్యక్రమంలో పాల్గొని వీక్షించారు.

ఈ వేడుకల్లో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోశిక వినయ్‌ కుమార్‌, 19వ వార్డు కౌన్సిలర్‌ పిల్లలమర్రి మధుసూదన్‌, పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.