తండ్రి విక్రయించిన భూమిపై కుమారుల కన్ను!
• చౌటుప్పల్లో భూ ఆక్రమణకు యత్నించారంటూ ఫిర్యాదు • భూమి చుట్టూ నాటిన కడీలు ధ్వంసం చేశారని ఆరోపణ • గతంలోనూ దాడులు జరిగాయని బాధిత కుటుంబం వెల్లడి సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భూ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. చౌటుప్పల్ రెవెన్యూ పరిధిలో తండ్రి విక్రయించిన భూమి విషయంలో ఆయన కుమారులు అడ్డంకులు సృష్టిస్తూ, భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బొమ్మిడి నర్సిరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల భూమి చుట్టూ నాటిన కడీలను ధ్వంసం చేశారంటూ...