Wednesday, September 23, 2026
spot_img
HomeTelanganaయాదాద్రి భువనగిరిఉచిత నీట్ లాంగ్‌టర్మ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉచిత నీట్ లాంగ్‌టర్మ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

ఈ నెల 22 వరకు దరఖాస్తులకు అవకాశం

అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: డీసీవో సుధాకర్

సూర్య డిజిటల్ న్యూస్, యాదాద్రిభువనగిరి:

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న ఉచిత ‘నీట్‌’ లాంగ్‌టర్మ్‌ శిక్షణకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యా సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ సుధాకర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన శిక్షణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపికైన బాలురకు హైదరాబాద్‌లోని చిలుకూరు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ ఫౌండేషన్‌ సీఓఈలో, బాలికలకు మహేంద్రహిల్స్‌లోని శిక్షణ కేంద్రంలో ఉచితంగా నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ అందించనున్నట్లు తెలిపారు.

ఎవరెవరు అర్హులు?

2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ (బైపీసీ) పూర్తి చేసి, నీట్‌ (యూజీ)-2026 పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు.

ఆదాయ పరిమితి:

గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:

అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తి చేయాలి. దరఖాస్తుతో పాటు నీట్‌-2026 స్కోర్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ మార్కుల మెమోలను జత చేయాల్సి ఉంటుంది.

ఈ చిరునామాకు పంపాలి:

ప్రిన్సిపాల్‌, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ (బాలురు), రాజాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, పిన్‌కోడ్‌–508105.

దరఖాస్తుకు ఎలాంటి రుసుము లేదని, అర్హులైన విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని జిల్లా కోఆర్డినేటర్‌ సుధాకర్‌ సూచించారు. NEET‌ కోసం ఉచిత లాంగ్‌టర్మ్‌ శిక్షణ పొందేందుకు లభిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.