– జలాల్‌పురంలో ఘనంగా పోషణ్ మాసం వేడుకలు
– సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు
సూర్య డిజిటల్ న్యూస్, భూదాన్‌పోచంపల్లి : మండలంలోని జలాల్‌పురం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో ‘పోషణ్ మాసం-సెప్టెంబర్ 2026’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మ, గ్రామ సర్పంచ్ శాపాక లింగస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు తక్కువ ఖర్చుతో లభించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. రక్తహీనత నివారణకు సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో 1వ వార్డు సభ్యుడు బైరు వెంకటేష్ గర్భిణులకు చీరలు, గాజులు బహుకరించి శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, వార్డు సభ్యులు గుర్రం వైష్ణవి, బైరు శివాలు, నాగార్జున, కిరణ్, బలిమణి, సిద్ధం శివాజీ, పాలుకుర్ల సంతోష్, ఏఎన్‌ఎం సుమలత, ఆశా కార్యకర్త పద్మ, అంగన్‌వాడీ టీచర్ చల్లా మంగ, ఆయా బుగ్గమ్మ, సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

