Wednesday, September 23, 2026
spot_img
HomeTelanganaమంచిర్యాలప్రజాసమస్యపై స్పందన.. రోడ్డు గుంత పూడ్చివేత

ప్రజాసమస్యపై స్పందన.. రోడ్డు గుంత పూడ్చివేత

📰 Generate e-Paper Clip

• జన్నారంలో వాహనదారుల కష్టాలు తీర్చిన పీసీఆర్ ఫౌండేషన్

• ప్రజా సంక్షేమమే ధ్యేయమన్న వ్యవస్థాపకుడు ముడుగు ప్రవీణ్

సూర్య డిజిటల్ న్యూస్, జన్నారం:

జన్నారం మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతను పీసీఆర్ (పూర్ణచందర్రావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పూడ్చివేశారు. రహదారిపై పెద్ద గుంత ఏర్పడటంతో వాహనదారులు, కాలినడకన వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముడుగు ప్రవీణ్ ఆధ్వర్యంలో సభ్యులు స్వయంగా రంగంలోకి దిగి మట్టి, రాళ్లతో గుంతను పూడ్చి రాకపోకలకు వీలుగా మార్చారు. ఈ సందర్భంగా ముడుగు ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పీసీఆర్ ఫౌండేషన్ ఎల్లవేళలా ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మున్వర్ ఆలీ ఖాన్, కొత్త శీను గుప్తా, నల్లతీగల విష్ణు, రవి, కొమురవెల్లి లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.