Wednesday, September 23, 2026
spot_img
HomeTelanganaయాదాద్రి భువనగిరివిద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

📰 Generate e-Paper Clip

– పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

– ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ జువ్వి నర్సింహ

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్:

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థులకు ఏకరూప దుస్తులను ఏపీఎం యాదయ్యతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ జువ్వి నర్సింహ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న విద్యా, సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సర్పంచ్ సూచించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకుంటూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫక్కీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు సామిడి సంధ్య, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, జంగం వెంకటమ్మ, సీసీ మామిళ్ల నర్సింహ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గూడూరు సునీత, వీఓఏలు సంతోష, మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.