Wednesday, September 23, 2026
spot_img
HomeCrimeకెమికల్ దందా గుట్టు రట్టు

కెమికల్ దందా గుట్టు రట్టు

📰 Generate e-Paper Clip

– ఐదుగురు అరెస్ట్‌.. ఐదు వాహనాలు స్వాధీనం

– ట్యాంకర్‌ డ్రైవర్లతో కుమ్మక్కై అక్రమంగా విక్రయం

– వెలిమినేడు శివారులో చిట్యాల పోలీసుల దాడి

సూర్య డిజిటల్ న్యూస్, చిట్యాల:

పారిశ్రామిక రసాయనాలను తరలిస్తున్న ట్యాంకర్ల నుంచి అక్రమంగా రసాయనాలను దారి మళ్లించి, డ్రమ్ముల్లో నిల్వ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును చిట్యాల పోలీసులు రట్టు చేశారు. వెలిమినేడు శివారులోని రాజస్థాన్‌ ధాబా సమీపంలో ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కెమికల్‌ ట్యాంకర్లు, మూడు ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్యాంకర్‌ డ్రైవర్లతో కుమ్మక్కైన నిందితులు పారిశ్రామిక రసాయనాలను తక్కువ ధరకు అక్రమంగా సేకరించి, వాటిని ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నిల్వ చేసేవారు. అనంతరం ఇతర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు వెలిమినేడు శివారులో నిఘా ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఐదుగురు అరెస్ట్‌:

అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు సత్యనారాయణ అలియాస్‌ సతీష్‌తో పాటు ఇద్దరు ట్యాంకర్‌ డ్రైవర్లు, ఇద్దరు కూలీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రసాయనాలతో కూడిన ప్లాస్టిక్‌ డ్రమ్ములు, రసాయనాలను తరలించేందుకు ఉపయోగించే పైపులు, రవాణాకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు:

ఈ అక్రమ రసాయనాల దారి మళ్లింపు వ్యవహారం వెనుక మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ ముఠా ఎప్పటి నుంచి రసాయనాలను దారి మళ్లిస్తోంది? ఎక్కడెక్కడ విక్రయించారు? ఇందులో మరెవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.