Wednesday, September 23, 2026
spot_img
HomeTelanganaయాదాద్రి భువనగిరిఉత్తమ తహసీల్దార్‌ వీరబాయికి ఘన సన్మానం

ఉత్తమ తహసీల్దార్‌ వీరబాయికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

అవార్డు అందుకున్న సందర్భంగా అభినందించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి

 

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్:

చౌటుప్పల్ మండలంలో ప్రజలకు వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించినందుకుగాను యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉత్తమ తహసీల్దార్‌గా ఎంపికైన వీరబాయిని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి సోమవారం ఘనంగా సన్మానించి అభినందించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రతినిధుల చేతుల మీదుగా వీరబాయి ఉత్తమ తహసీల్దార్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన ఇంద్రసేనారెడ్డి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఆర్‌ఐలు బాణాల రాంరెడ్డి, గుత్తా వెంకట్‌రెడ్డి, బత్తుల శ్రీహరి, తూర్పుంటి రవి, లచ్చునాయక్, తిగుళ్ల బాలరాజు, జీపీవోలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.