Saturday, November 7, 2026
spot_img
HomeTelanganaయాదాద్రి భువనగిరిఅర్హులకు ‘స్మార్ట్’ రేషన్ కార్డులు

అర్హులకు ‘స్మార్ట్’ రేషన్ కార్డులు

📰 Generate e-Paper Clip

• లబ్ధిదారులకు కార్డులు అందజేసిన ఫ్లోర్ లీడర్ శేఖర్ గౌడ్, చైర్మన్ వెంకటయ్య

• నిరుపేదలకు సకాలంలో ప్రభుత్వ ఫలాలుః నాయకులు

• కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, పుర ప్రజలు

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి 5వ వార్డులో శుక్రవారం స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మున్సిపల్ ఫ్లోర్‌ లీడర్‌, 5వ వార్డు కౌన్సిలర్‌ కొయ్యడ శేఖర్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఉబ్బు వెంకటయ్య ముఖ్య అతిథులుగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను స్వయంగా అందజేశారు.

సులభంగా రేషన్ సేవలు:

ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందన్నారు. రేషన్ సేవలు పొందడంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు తొలగిపోతాయని, భవిష్యత్తులో ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వేగంగా అందుతాయని పేర్కొన్నారు. అర్హత ఉండి కార్డులు రాని వారు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం:

మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరవేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం పాలకులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు.

ఈ పంపిణీ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్‌ ఊదరి యాదయ్య, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ రావుల స్వామి, స్థానిక నాయకులు పందుల రాజేష్‌, బొడ్డు ముత్యం, ఎండీ అస్లాం ఖాన్‌, బొల్లోమోని శ్రీకాంత్‌, రేషన్‌ డీలర్‌ అరుణతో పాటు అధిక సంఖ్యలో వార్డు మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.