Saturday, November 7, 2026
spot_img
Homeభక్తిభాస్కర్ థియేటర్ వద్ద కన్నులపండువగా ‘రావణ దహనం’

భాస్కర్ థియేటర్ వద్ద కన్నులపండువగా ‘రావణ దహనం’

📰 Generate e-Paper Clip

భాస్కర్ థియేటర్ వద్ద కన్నులపండువగా ‘రావణ దహనం’

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్‌ బత్తుల వాణి విప్లవ్‌ కుమార్‌

– అభ్యుదయ యూత్‌ ఆధ్వర్యంలో వేడుకలు

– జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటూ అలాయ్‌ బలాయ్‌.. టపాసుల మోత

సూర్య డిజిటల్‌ న్యూస్‌, చౌటుప్పల్‌: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో భాస్కర్‌ థియేటర్‌ ఎదురుగా అభ్యుదయ యూత్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి రావణ దహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్‌ బత్తుల వాణి విప్లవ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై రావణ దహనం చేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్‌ బత్తుల వాణి విప్లవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ తాము చేపట్టిన పనుల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి వార్డు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

విజయదశమి వేడుకల్లో భాగంగా వార్డు ప్రజలు జమ్మి ఆకులను (బంగారాన్ని) పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ పెద్దల ఆశీస్సులు తీసుకుని అలాయ్‌ బలాయ్‌ చేసుకున్నారు. రంగురంగుల టపాసులు కాల్చుతూ చిన్నాపెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా పండుగ సంబరాల్లో మునిగితేలారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ యూత్ ప్రతినిధులు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.