Wednesday, September 23, 2026
spot_img
HomeCrimeరోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

తూప్రాన్‌పేట్‌ వద్ద ఘటన

చౌటుప్పల్ మార్చురీలో మృతదేహం భద్రత

గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్‌:

రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూప్రాన్‌పేట్‌లో చోటుచేసుకుంది.  చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం (ఆగస్టు 8) రాత్రి 10 గంటల సమయంలో తూప్రాన్‌పేట్‌ ప్రాంతంలో రహదారిపై సుమారు 30 నుంచి 40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి ప్రమాదానికి గురై మరణించాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదు.

మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడు సుమారు 5.5 అడుగుల ఎత్తు, గులాబీ రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. కుడిచేతిపై ‘అమ్మ’ అని పచ్చబొట్టు పొడిచి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ తెలిపారు. మృతుడి ఆచూకీ లేదా వివరాలు తెలిసిన వారు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌ నంబర్ 8712662744 లో సంప్రదించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.