Wednesday, September 23, 2026
spot_img
Homeయాధాద్రీఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

📰 Generate e-Paper Clip

• పద్మజ్యోతి యువజన సంఘం సేవా కార్యక్రమం

• ఉచిత మందుల పంపిణీ

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్ :

సమాజ సేవలో భాగంగా కొయ్యలగూడెం పద్మజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వనస్థలిపురంలోని ప్రగ్మా హాస్పిటల్స్ వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించింది.

శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా రక్తపోటు, మధుమేహం, రక్త పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పద్మజ్యోతి యువజన సంఘం అధ్యక్షుడు బడుగు కైలాసం మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సహాయం అందించిన పద్మజ్యోతి యువజన సంఘం సభ్యులను గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు అభినందించారు.

కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు వెంకటేశం, రాజు, సురేందర్, రాఘవేంద్ర, ఆనంద్, శ్రీను, శేఖర్, గిరీష్, పాండు, సతీష్, సంతోష్, శ్రీనాథ్‌తో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.