Wednesday, September 23, 2026
spot_img
Homeయాధాద్రీభూగర్భ జల సంరక్షణకు జలసిరి

భూగర్భ జల సంరక్షణకు జలసిరి

📰 Generate e-Paper Clip

ఇంకుడు గుంతలతో వర్షపు నీటిని ఒడిసిపట్టాలి: సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్ :

భూగర్భ జలాల సంరక్షణ, నీటి మట్టాల పెంపుదలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ జువ్వి నర్సింహ్మ ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ జువ్వి నర్సింహ్మ మాట్లాడుతూ.. వర్షపు నీరు వృథాగా వెళ్లకుండా భూగర్భంలోకి ఇంకేలా చేయడంలో ఇంకుడు గుంతలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. వర్షపు నీటిని భూగర్భంలోకి పంపించడం ద్వారా భూగర్భ జలమట్టాలను పెంచుకోవచ్చని తెలిపారు.

ప్రస్తుతం భూగర్భ జలాల సంరక్షణ ఎంతో అవసరమని, భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గ్రామంలో సాధ్యమైనంత ఎక్కువగా ఇంకుడు గుంతలను నిర్మించి వర్షపు నీటిని సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జలసిరి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సామిడి సంధ్య, ఐతరాజు శారద, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.