Wednesday, September 23, 2026
spot_img
Homeయాధాద్రీనూతన జూనియర్ సివిల్ జడ్జిని కలిసిన ప్రభుత్వ న్యాయవాది

నూతన జూనియర్ సివిల్ జడ్జిని కలిసిన ప్రభుత్వ న్యాయవాది

📰 Generate e-Paper Clip

జడ్జి శాలినికి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపిన వాకిటి నర్సింహా రెడ్డి

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్:

చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టుకు నూతనంగా నియమితులైన జూనియర్ సివిల్ జడ్జి శాలినిని ప్రభుత్వ న్యాయవాది వాకిటి నర్సింహా రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జడ్జి శాలినికి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కోర్టు పరిధిలోని న్యాయపరమైన అంశాలు, న్యాయవాదుల విధులు తదితర విషయాలపై కొద్దిసేపు చర్చించారు. నూతన జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన శాలినికి న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాదితో పాటు న్యాయవాదులు పాల పరమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.