Wednesday, September 23, 2026
spot_img
Homeయాధాద్రీ3వ వార్డు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బండమీది వెంకటేష్‌

3వ వార్డు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బండమీది వెంకటేష్‌

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో నియామకం

పార్టీ బలోపేతానికి శ్రమిస్తా: నూతన అధ్యక్షుడు వెంకటేష్

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్:

చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు (లింగోజిగూడెం) అధ్యక్షుడిగా బండమీది వెంకటేష్ శనివారం నియమితులయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేన రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి కలిసి వెంకటేష్‌కు బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించాలని, అంకితభావంతో పనిచేయాలని కోరారు.

వెంకటేష్ నియామకంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేన రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డికి బండమీది వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.