Wednesday, September 23, 2026
spot_img
Homeయాధాద్రీభారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

📰 Generate e-Paper Clip

రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం

కొండమడుగు ల్యాబ్‌లో అక్రమ తయారీ.. నలుగురు అరెస్ట్, పలువురు పరారీ

సూర్య డిజిటల్ న్యూస్, యాదాద్రిభువనగిరి :

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాల మేరకు బీబీనగర్ పోలీసులు, ఎస్‌ఓటీ బృందం సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో రికార్డు స్థాయిలో రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కొండమడుగు శివారులోని వేటుకూరి ల్యాబ్స్‌లో అక్రమంగా మెఫెడ్రోన్ డ్రగ్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తయారు చేసిన మాదకద్రవ్యాన్ని ఫార్చ్యూనర్ కారులో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ కేసులో చేతన్ మధుకర్, ముజామల్ హక్, ఆకాశ్, ల్యాబ్ ఇన్‌చార్జ్ రమణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ల్యాబ్ యజమాని రామరాజుతో పాటు మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

దాడుల సందర్భంగా ల్యాబ్‌లో డ్రగ్స్ తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలతో పాటు సుమారు 40 కిలోల అసిటోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ హెచ్చరించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల దందాలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.