• నూతన అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్:
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
సర్వసభ్య సమావేశానికి గ్రామ సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్, ఉప సర్పంచ్ జెల్ల పవన్, రామాలయం చైర్మన్ మాచర్ల సంతోష్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ నూతన అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అదేవిధంగా ఆలయ నూతన డైరెక్టర్లుగా ఏలే మురళి, సూరకంటి మోహన్‌రెడ్డి, కొయ్యడి స్వామి గౌడ్, అల్మాస్‌పేట గౌతమ్, రాసాల నర్సింహా, దికొండ ఉదయ్ కిరణ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను సర్వసభ్య సమావేశంలో పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆలయ ప్రతిష్ఠను మరింత పెంపొందిస్తూ, భక్తుల సహకారంతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజలు, భక్తులు అందరూ సహకరించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు కోరారు.

