Wednesday, September 23, 2026
spot_img
Homeయాధాద్రీపర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

📰 Generate e-Paper Clip

* మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ కూడా అవసరం

* దేవలమ్మ నాగారంలో వన మహోత్సవం సందర్భంగా విస్తృతంగా మొక్కల నాటకం

* సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్‌గౌడ్

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్:

పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని దేవలమ్మ నాగారం గ్రామ సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా చేపట్టాలని సూచించారు. కేవలం మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని, అవి ఎదిగి పెద్దవయ్యే వరకు సంరక్షించాలని అన్నారు.

మొక్కల పెంపకం ద్వారా అటవీ విస్తీర్ణం పెరుగుతుందని, తద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని తెలిపారు. చెట్ల పెంపకంతో వర్షపాతం పెరిగి, సమయానికి సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయానికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా భావితరాలకు మెరుగైన జీవన వాతావరణాన్ని అందించవచ్చన్నారు.

వన మహోత్సవం వంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుర్కంటి అనూప్‌రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి రమేష్, బొమ్మ శ్వేత, బొమ్మ అమరావతి, ఫాతిమా, దోనూరి కిరణ్‌రెడ్డి, గట్టు ప్రశాంత్, పాక రాము, సుంకరి శ్రీను, దేశట్ల చైతన్య, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బొమ్మ మైసయ్య, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.