Wednesday, September 23, 2026
spot_img
HomeCrimeభారీగా రేషన్ బియ్యం పట్టివేత

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

📰 Generate e-Paper Clip

• 42 బస్తాల్లో అక్రమంగా నిల్వ.. కేసు నమోదు

• హయత్‌నగర్‌లో పోలీసుల తనిఖీలు

సూర్య డిజిటల్ న్యూస్, హయత్‌నగర్‌:

అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్‌ బియ్యాన్ని హయత్‌నగర్‌ పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌ సూర్యనగర్‌ కాలనీకి చెందిన అంగోతు లక్ష్మణ్‌ (52), యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలం అంగోతు తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఈ నెల 21న ఉదయం 10 గంటల సమయంలో లక్ష్మణ్‌ నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. 42 బస్తాల్లో సుమారు 20 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, తరలించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.