Wednesday, September 23, 2026
spot_img
HomeCrimeసాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

సూర్య డిజిటల్ న్యూస్, వనస్థలిపురం:

ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హస్తినాపురంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. హస్తినాపురానికి చెందిన చలిచీమల కిశోర్‌బాబు (38) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 20న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సాయంత్రం 5 గంటల సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన భార్య గమనించి వెంటనే కిశోర్‌బాబును ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.